Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

7వ స్థానంతో యూట్యూబ్ లో దూసుకుపోతున్న 'రౌడీబేబీ' సాంగ్

  • రికార్డులు బద్దలు కొడుతున్న రౌడీ బేబీ
  • స్వయంగా ప్రకటించిన యూట్యూబ్
  • ధనుష్, యువన్, ప్రభుదేవాల కృషి ఫలితం
సోషల్ మీడియా రాకతో ఎంటర్టైన్మెంట్ రంగం రూపు రేఖలే మారిపోతున్నాయి. ఇందులో భాగమైన యూట్యూబ్ కొత్త కొత్త రికార్డులకు వేదికగా మారుతోంది. తాజాగా ప్రపంచ సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ధనుష్-సాయి పల్లవిల ‘మారి-2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ పాట యూట్యూబ్ వ్యూస్ లో రికార్డుల మోత మోగిస్తోంది.

ఇప్పటి వరకూ 716 మిలియన్ వ్యూస్ ను అధిగమించి దూసుకుపోతూ యూట్యూబ్ రికార్డుల్లో 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ధనుష్ స్వయంగా రాసి, పాడిన ఈ పాటకు స్వరకర్త యువన్ శంకర్ రాజా కాగా, అదిరి పోయే స్టెప్పులను ప్రముఖ కొరియో గ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా అందించారు. ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్ టాప్ 7లో నిలిచి రికార్డులను సృష్టించిన విషయాన్ని యూట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం.
rowdy baby
prabhudeva
saipallavi

More Telugu News